విద్యుత్ రంగంలో మ‌రింత అభివృద్ధి

  • పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి రూ.205కోట్ల నిధులు
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : పాలేరు నియోజకవర్గం (Palair constituency)లో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో రూ. 205 కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలోని తరుణి హాట్‌లో కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్ తో కలిసి డివిజన్ ఈఆర్‌ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొం గు లేటి మాట్లాడుతూ.. పాలేరు నియోజక వర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, హైటె న్షన్ విద్యుత్ వైర్ల మార్పిడి, కొత్త విద్యుత్ లై న్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు వంటి పనులకు రూ. 205 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. చేపట్టిన పనుల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు.

ప్రతిపక్ష నాయకులు విద్యుత్ రంగంపై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని మంత్రి అన్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదని, తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిందని తెలి పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి అధిక వ్యయం జరిగిన అంశాలను సరిదిద్దుతూ విద్యుత్ రం గంలో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పా రు. తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. భవిష్యత్ వి ద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టీజీఎన్ పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ రావు, వి ద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎదులాపురం మునిసిపల్ కమీషనర్ ఏ. శ్రీని వాస రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారు లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *