సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
న్యూదిల్లీ, అక్టోబర్ 1: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగ దని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్ప ష్టం చేశారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. అక్టోబర్ 2 నుంచి ఈ నిరస నలు ప్రారంభంకానున్నట్లు అభిజీత్ దీప్కే తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ నియామకంలో పారదర్శకత ఉండాలని, పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పిం చాలని అన్నారు. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 2న సా యంత్రం ‘జైల్ భరో ఆందోళన్’ చేపట్టాలని సీజీపీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అను మతి నిరాకరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకా అక్కడ సభల నిర్వహణకు అనుమతి లేదని తెలిపారు. ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు.





