మోటర్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీచేయను

– ఉచిత విద్యుత్‌ ఆపేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా
– లేకుంటే బిఆర్‌ఎస్‌ ‌రాజకీయాల నుంచి తప్పుకుంటుందా
– రైతుల ముసుగులో లబ్దికి కెసిఆర్‌ ‌రాజకీయ ఎత్తుగడలు
– ధాన్యం కొరుగోళ్లలో కేంద్రం తీరు దుర్మార్గం
– కొనకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లముందు ధాన్యం పోస్తాం
– హరీష్‌ ‌రావు భవిష్యత్తు ఆయన చేతుల్లోనే లేదు
– మహేష్‌ ‌గౌడ్‌ది, నాది విన్నింగ్‌ ‌కాంబినేషన్‌
– మీ‌డియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 30: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ‌నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఈ సవాల్‌కు బీఆర్‌ఎస్‌ ‌సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌ ‌చాట్‌ ‌చేస్తూ రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్‌ ‌రైతుల ముసుగులో లైఫ్‌ ‌లైన్‌ ‌కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ’రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్‌ ‌కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. మోటార్లకు టర్లు పెడితే, రైతులకు ఉచిత విద్యుత్‌ ‌నిలిపివేస్తే.. తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. తాము ఉచిత విద్యుత్‌ ‌కొనసాగిస్తే.. బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు దూరంగా ఉంటుందా అని సిఎం రేవంత్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రైతుల ముసుగులో కేసీఆర్‌ ‌రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అం‌దించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ ‌వినియోగాన్ని దీనికి కనెక్ట్ ‌చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. వ్యవసాయ మోటర్లకు టర్లు పెట్టాలని ప్రధాని మోడీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇది చెప్పకున్నా బిఆర్‌ఎస్‌ ‌తన రాజకీయ లబ్ది కోసం పదేపదే దీనిని వాడుకుందని ఆరోపించారు. ఎపిలో కూడా జగన్‌ ‌స్మార్ట్ ‌టర్లు పెడతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మేం ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే  రూ.95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నాం. మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్‌రావు చెప్పడం లేదు. రూ.54 వేల కోట్లు అప్పులు తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి వదిలేసిందే తప్ప ఒక్క గింజ కూడా కొనడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పిస్తున్నామని, సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు ఢిల్లీకి బస్సులు వేసుకుని వెళ్లి ధాన్యం కొనుగోలుకు ఒత్తిడి తేవలన్నారు. లేకుంటే తాము వారి ఇళ్ల ముందుకే ట్రాక్టర్లతో వడ్లు తెచ్చి పోస్తామని ఆయన హెచ్చరించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధాని మోదీ మాటలు చెబుతున్నా, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వడ్లు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో 32 శాతం ధాన్యం మాత్రమే కొంటోంది. ధౄన్యం కొనకపోతే  బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం. అంతర్రాష్ట్ర జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెబుతున్నారు. ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ప్రయత్నిస్తున్నాం. ఆయన ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. హరీష్‌ ‌రావు ఇదులకుంట చెరువు అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ‌విగ్రహం చుట్టూ ప్రాంతీయ, కుల వివాదాలు చేయడం బుద్ధిలేనితనమని, తన దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉందని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌ద ఒట్టేసి.. బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని హరీశ్‌రావు చెప్పాలన్నారు.  గతంలోనూ హరీష్‌ ‌రావు.. వైఎస్సార్‌ ‌దగ్గరికి వెళ్లారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు.. కానీ చెప్పను. ఇటీవల పార్టీ టింగ్‌ ‌వదిలేసి ఆయన దిల్లీకి ఎందుకు వెళ్లారు? బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానమే లేదు. సీబీఎస్‌ఈలో జవాబపత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా.. కేటీఆర్‌ ‌బినా సంస్థ. గ్లోబరీనా సంస్థ కేటీఆర్‌ ‌బినాదేనని ఆరోపించిన సీఎం అదే ఇప్పుడు పేరు మార్చుకుందన్నారు. 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను. పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌నాది విజయవంతమైన కాంబినేషన్‌. ‌మేం అన్ని ఎన్నికలు గెలిచాం. భవిష్యత్తులోనూ విజయం సాధిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి పదవి రావొచ్చు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలకు ఇప్పుడే తొందర లేదు. ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతంతో పోల్చడం బుద్ధిలేనితనం. పొట్టి శ్రీరాములు వర్సిటీకి సురవరం పేరు పెట్టిందే నేను. వివాదాలు, సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదని సీఎం రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *