- ప్రభుత్వాలు మారినా మారని పాలసీలు
- ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రం
- గతంలో ప్రజా వ్యతిరేకతను అణచివేస్తే.. ఇప్పుడు ఏకపక్ష అనుమతులతో ముందుకు..
- వ్యర్థాల విడుదలలో నిబంధనలకు పాతర
- విషతుల్యమవుతున్న వాగులు, భూగర్భ జలాలు
- కాలుష్య పరిశ్రమలను రద్దు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 24:
తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేస్తూ.. భూమి, నీరు, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ పరిశ్రమల (Telangana Ethanol IndustriesTelangana Ethanol Industries)విషయంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి భిన్నమై న పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎల్ని నో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పాలకులు చెబు తుండగా, మరోవైపు నీటి వనరులు, పర్యావరణాన్ని కలుషితం చేసే ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాభిప్రాయాలు గాలికి..
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను గాలికి వ దిలేసినట్లే కనిపిస్తోంది. ఎక్కడా ప్రజాభిప్రా య సేకరణ పారదర్శకంగా జరిగినట్లు కని పించడం లేదు. గతంలో టీఎస్-ఐపాస్ ద్వా రా రాష్ట్రంలో 2021–23 మధ్య సుమారు 18 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి.
ప్రజల వ్యతిరేకత.. ప్రభుత్వాల వైఖరి
ప్రస్తుతం రాష్ట్రంలో 30 వరకు ఇథనాల్ పరిశ్ర మలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇథనాల్ కంపెనీల ఏర్పాటుపై ప్రజ ల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గద్వాల జిల్లా ధన్వాడలోని రెండు కంపెనీల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. రానురాను ప్రభుత్వ వైఖరిలో మార్పు వొచ్చినట్లు కనిపిస్తోంది. స్థానికులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇథనాల్ కం పెనీలకు అనుకూలంగానే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గత ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా, బలవంతపు అభిప్రాయ సేకరణతో అనుమ తులు ఇస్తున్నట్లు ప్రజాసంఘాలు ఆరోపిస్తు న్నాయి. ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను యథేచ్ఛగా సమీప ప్రాంతాల్లోనే వదిలేస్తుండడంతో నదులు, వాగులు, భూగ ర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇథనాల్ పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతాల్లో దుర్వాస న కారణంగా ప్రజలు నివసించలేని పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతూ, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇథనాల్ బ్లెండింగ్తో లాభం ఎవరికి?
ఇథనాల్ బ్లెండింగ్ వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, రైతులు పండించిన ముడిసరుకులకు సరైన మద్దతు ధర లభించడం లేదని పలువు రు రైతు సంఘాల నాయకులు పేర్కొంటు న్నారు. ఇథనాల్ పరిశ్రమల నిర్వాహకులకే లాభాలు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు, పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరో గ్యాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వాలు వ్యవహరించడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై పునరాలోచన చేసి, అవసరమైన చోట పరిశ్రమల మూసివేతకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణాన్ని, ప్రజలను కాపాడాలని రైతులు ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ విషయం ప్రజల ప్రమేయం లేకుండా చేస్తున్నారు





