జనవరి 2027లో మూసీ ఫేజ్-1 పనులు

– 2028 నాటికి మిరాలం ట్యాంక్ పూర్తి
– హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు రెండు జోన్లుగా పనులు
– మార్చి 2027 నాటికి గండిపేట ఆధునిక గోశాల పనులు పూర్తి
– మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణ పురోగతి, పట్టణాభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగ ళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం ఫేజ్-1 పనుల వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఫేజ్-1 పనులను రెండు జోన్లుగా విభజించి చేపట్టనున్నట్లు అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏగా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీగా విభజించినట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని, జనవరి 2027లో పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధి కారులు సీఎంకు నివేదించారు.

మిరాలం ట్యాంక్, రేడియల్ రోడ్లు, గోశాల పనులపై దిశానిర్దేశం

మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగ తిపై సీఎం ఆరా తీయగా, జనవరి 2028 నాటికి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో పాటు అందులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని అధికారులు వివరించగా, రోడ్ల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూ చించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి మార్చి 2027 నాటికి పనులు పూరి చేసేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *