ఎన్ని కుట్రలు జరిపినా,ఎన్ని ఎత్తులు వేసినా ఎంతటి దమననీతిని అమలు చేసినా మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఆరంభం అయ్యింది. ప్రజాస్వామ్యం పై దాడి చేసి ఎల్లకాలం పరిపాలించాలనే తత్వాన్ని అలవర్చుకొని రైతులు, నిరుద్యోగులు కడుపు మండితే ఎదురుదాడి చేసి ఏమి సాధిస్తారు? వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలకులు మూటాముల్లె సర్దుకొని వెళ్ళింది నిజంకాదా? 2014లో ముక్త కాంగ్రెస్,ముక్త భారత్ అంటే ప్రజలు మీకు పట్టం కట్టారు కదా? చరిత్రను తిరగరాయడానికి గొప్పశక్తులు అవసరంలేదు, తప్పులమీద తప్పులు చేస్తూ ,ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిభను ఏమార్చే విధంగా జిరాక్స్ షాప్ ల్లో ,పల్లి ,బఠానీల్లా అమ్ముతుంటే విద్యార్థులు,వారి తల్లి,తండ్రులు ప్రతిభ చేజారి, లక్ష్యం నీరుగారి విగతజీవులుగా మారి మొక్కవోని విశ్వాసంతో రగిలిపోయిన గుంపు ఇలాంటి ఉద్యమాలకు ఉపిరిపోస్తాయన్నది కాక్రోచ్ దండును చూస్తే అర్ధం అయ్యింది.నిజంగానే అధికారం కోసమో రగిలిన ఉద్యమం కాదు కదా? బీజేపీ పాలించిన 12సంవత్సరాలలో 152పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం, బాధ్యులకు శిక్షలు పడకపోవడం యథేచ్ఛగా తప్పులు పునరావృతం కావడం విద్యార్థిలోకం జీర్ణించుకోవడం లేదు.అందులో ‘నీట్’ పరీక్షా ‘లీక్’ రద్దుతో కొద్దీ మంది బాధితుల సమూహం మార్పు చేయకలదన్న మహాత్మాగాంధీ మాటలు రుజువుచేశాయి.కాక్రోచ్ జనతా పార్టీ లీకేజీలకు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడం,నెలరోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా స్పందించక నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించి,వచ్చే ముప్పును పసికట్టలేదు.
సామాజిక ఉద్యమకారుడు ‘సోనం వాంగ్ చుక్’ రెండు వారాలుగా చేసిన నిరవధిక నిరాహారదీక్షను పట్టించుకున్న పాపానపోలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునాడే సిజేపీ ‘చలో సంసద్’ కు పిలుపునిచ్చారు. అత్యున్నత మైన పార్లమెంట్ ముట్టడికి పిలుపు ఇవ్వడం మోదీకి మండిందేమో కానీ, స్వయంకృతాపరాధమే.నిర్లక్ష్యం ఫలితమే జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు సాగిన యాత్ర, మోదీ ప్రభుత్వం మిల్ట్రీ బలగాలను దించినా దారిపొడుగునా మెట్రో స్టేషన్స్ మూసివేసినా,సోషల్ మీడియా బ్యాన్ చేసినా లక్షకు పైగా ‘బొద్దింకల’ దండు పార్లమెంట్ గేట్ ను తాకింది. పోలీసులు లాఠీలతో కొట్టినా, కాళ్లతో తొక్కినా ,తలలు పగిలిన కాక్రోచ్ దళం వెనుదిరుగలేదు.ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ తిరుగుబాటుతో చలించడం చూస్తే ..మోదీ పట్టింపులకు పోయి ధర్మేంద్ర రక్షించడానికి పోయి బొక్క బోర్లాపడి దేశంలో విద్యార్థులకు,నిరుద్యోగులకు ద్రోహిగా నిలబడ్డ పరిస్థితి వచ్చింది.ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మండిపోతుంటే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా కోరకుండా సంకలపెట్టుకొని ఊరేగడాన్ని భారత సమాజం డేగకళ్లతో గమనిస్తున్నదిదేశంలోని విద్యార్థిలోకం అడుగుతున్నది.మోదీ మొఘల్ చక్రవర్తి కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే రాజకీయాలకోసం మాట్లాడుతారు అనుకున్నాం,కానీ విద్యార్థులపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కౄరంగా అణచివేయడాన్ని యావత్ దేశం నిరసన వ్యక్తం చేసింది.
‘నీట్’ పేపర్ లీక్ కు కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ చేస్తున్న నిరసన ప్రదర్శనలో విద్యార్థులపై పాశవికంగా,అమానుషంగా చేసిన దాడిని నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్,మిత్రపక్షాలు మోదీ ,అమిత్ షా రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు.లోక్ కల్యాణ్ మార్గ్ లో మూడు గంటలకు పైగా హోరెత్తిన నినాదాలతో దద్దరిల్లింది.ఈ మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అవాక్కయ్యింది.ఈ తీవ్ర పరిణామాలతో ఖంగుతిన్నకేంద్ర ప్రభుత్వం మంత్రి జితేంద్రసింగ్ చర్చలు చేసినా ఫలితంలేదు.ప్రజాస్వామ్య బద్దంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే విపక్షాలపై పైశాచికంగా,హేయంగా దాడి చేయడం చుస్తే 2014 లో మోదీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు కప్పిపుచ్చుకోవడానికి రాహుల్, ప్రియాంకను టార్గెట్ గా ఎంచుకున్నారనేది స్పష్టంగా కన్పించింది.మోదీ హయాంలో ప్రశ్నపత్రాలు, లీకేజీలకు నిలయంగా మారింది. లీకేజీలకు పాల్పడ్డ బాద్యులపై కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లనే ప్రతిభగల విద్యార్థుల నోట్ల మట్టికొడుతున్నారనే భావం ఉంది, విద్యార్థులపట్ల రాహుల్ నిలవడం రాజ్యాంగం పట్టుకొని తిరిగితే ఆదరించని జనం కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ప్రజల పక్షాన నిల్చిన రాహుల్,ప్రియాంకా ,ఖర్గే లాంటి విపక్షనేతలను భయబ్రాంతులకు గురిచేసేవిధంగా లాఠీ జులిపించి, ఈడ్చుకొని రక్తం కళ్లచూడడం కారేలా చెయ్యి చేసుకోవడం ప్రజాస్వామ్యానికి చీకటిరోజుగా భావించాలి.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జాతీయ విద్యా విధానం అమలు చేయకుండా ‘లీక్’ లతో ప్రతిభ గల విద్యార్థులు మానసిక క్షోభకు గురైతే మోదీ విజన్ ఎలా నెరవేరుతుంది ? 2014 ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అబద్దమా ? పన్నెండేళ్ల పరిపాలనలో జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు,రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు ‘లీక్’ అబద్దమా? మోదీ ప్రభుత్వం భారతదేశం ఏడూ దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఉపాధి రేటును అనుభవించింది అన్న గణాంకాలు అబద్దమా ? నీట్ పరీక్షా నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) పై నెపం నెట్టి కేంద్ర మంత్రిని తప్పించకుండా నిప్పులమీద నీళ్లు చల్లినట్టు కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ వినీత్ జోషి బలి చేసింది.కాంగ్రెస్ హయాంలో లీక్ లు జరిగినాయని ఎదురుదాడి చేయడం కంటే ‘లీక్’ వీరులకు జీవితాంతం జైలు పాలు అయ్యే కఠినమైన చట్టాలు తేవాలి. చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలి, రెండు నెలలుగా విద్యార్థులకు రోడ్డుమీదికొచ్చి మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించింది. మాకు ఎదురు లేదని విర్రవీగిన బీజేపీ ప్రభుత్వానికి దిల్లీ విధుల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రవాహంలా వీచిన గాలి కేవలం దిల్లీకే పరిమితం కాదని అర్ధం అవుచున్నది.సామాజిక ఉద్యమాలతో బీటలు వారిన భయ సంకోచాలు రాజ్యవ్యవస్థ పట్ల యువ భారతీయులలో భయ ఆందోళన తొలిగిపోయిందని జూలై 20 నిరూపించింది. పుష్కరాళ్ల సమయంలో మోదీ రెండవసారి ఆత్మరక్షణలో పడ్డట్టు కన్పించింది.దేశ రాజధానిలో గత 15ఏళ్లలో అనేక ప్రజా ఉద్యమాలను చూసినాం కానీ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ప్రదర్శనను ఇంటలిజెన్స్ పసిగట్టక నిలువరించక పోయింది. రాహుల్ కు వచ్చిన ఇమేజీ తట్టుకోలేక ఇన్నాళ్లు ససేమిరా అన్న బిజెపి బీసీ మంత్రి అయినందునే ధర్మేంద్ర ప్రధాన్ ను బలి చేసిందనే విమర్శ ఉంది.