బుద్ధుని వాక్కు వికసించే ప్రదేశం..

ఇది కేవలం బౌద్ధ విహారం కాదు, మొంపా ప్రజల సంస్కృతికి కేంద్రం. బౌద్ధ ఉన్నత విద్యా కేంద్రం. ఇక్కడ లామాలు, సాధారణ ప్రజలు టిబెటన్ బౌద్ధం నేర్చుకుంటారు. టిబెటన్ ఆర్కిటెక్చర్ తో సంప్రదాయ శైలిలో, రంగు రంగుల పెయింటింగ్స్, బంగారం రంగు బుద్ధ విగ్రహాలు, చెక్క పైన కళా కృతులతో చాలా అందంగా ఉంది. ఎత్తైన పర్వతం పై నుంచి పచ్చని చెట్లతో కింద లోయ అంతా ఎంతో అందంగా కనిపిస్తుంది..”

గిరియానం .. 27

డిరాంగ్ లో చివరిరోజు రుమా దంపతులు చేసిన సత్కారాన్ని స్వీకరించాo. తమ దగ్గర బస చేసిన పర్యాటక అతిథులకు చిన్న సిల్క్ కండువాతో సత్కరించడం ముంపాతెగ ఆచారమట. ఇంటి భోజనం, ఆత్మీయమైన సన్మానం. ఇదీ హిమాలయాల్లో నివసిస్తున్న ముంపా తెగ సంస్కారం. ఆదివాసి సమాజంలో వున్న సంస్కారం మన నాగరిక సమాజంలో ఎక్కడుందిఈర్ష్యా, ద్వేషాలు తప్పితే.. చాలా ముచ్చటేసిందిఆత్మీయులను వదిలి వెళుతున్నామన్న బాధతో తిరిగి ప్రయాణమయ్యాం రోజు డిరాంగ్ నుంచి గౌహతి వరకు మా ప్రయాణం. ఎత్తైన పర్వతాల మధ్య సుమారు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి. పర్వత శిఖరాలతో మేఘాల దోబూచులాటను పరిశీలిస్తూ కూర్చున్నాను.

 మార్గమధ్యంలో డిరాంగ్ మొనాస్టరీ దగ్గర కారు ఆగింది. కారు పై దాకా పోదు. దిగి సుమారు ఒక కిలోమీటర్ పైకి నడిచాo. దీని అసలు పేరు తుప్సుంగ్ ధర్గే లింగ్. పేరును పధ్నాలుగవ దలైలామా పెట్టారట. దీని అర్థంబుద్ధుని వాక్కు వికసించే ప్రదేశం. ” ( ప్లేస్ ఆఫ్ ఫ్లర్షింగ్ బుద్ధాస్ స్పీచ్ ). ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని వెస్ట్ కమెంగ్ జిల్లా, డిరాంగ్ వ్యాలీలో ఉంది. దీని నిర్మాణం 2007లో మొదలై 2016లో పూర్తి అయిందట. 5/ 4 / 2017 నాడు పధ్నాలుగవ దలైలామా దీనిని ప్రారంభించారట. ఇది కేవలం బౌద్ధ విహారం కాదు, మొంపా ప్రజల సంస్కృతికి కేంద్రం. బౌద్ధ ఉన్నత విద్యా కేంద్రం. ఇక్కడ లామాలు, సాధారణ ప్రజలు టిబెటన్ బౌద్ధం నేర్చుకుంటారు. టిబెటన్ ఆర్కిటెక్చర్ తో సంప్రదాయ శైలిలో, రంగు రంగుల పెయింటింగ్స్, బంగారం రంగు బుద్ధ విగ్రహాలు, చెక్క పైన కళా కృతులతో చాలా అందంగా ఉంది. ఎత్తైన పర్వతం పై నుంచి పచ్చని చెట్లతో కింద లోయ అంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక గంట గడిపి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం. ఎత్తైన పర్వతాలు మాకు స్వాగతం చెప్పి వెనక్కి పోతున్నాయి. ప్రకృతిని పరిశీలించే కొద్దీ విభిన్న రకాలుగా మనకు గోచరిస్తుంది. అందుకే ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. ప్రకృతి మోహంలో ఉన్న నేను కారు ఆగడంతో లోకంలోకి వచ్చాను.

బొమిడిలా మొనాస్టరీకి చేరామన్న మాట. వెస్ట్ కమెంగ్ జిల్లా హెడ్ క్వార్టర్ బొమిడిలా నగరంలో సముద్రమట్టం నుంచి ఎనిమిది వేల ఐదువందల అడుగుల ఎత్తులో ఉంది. దీని అసలు పేరుగె౦ట్సే గాడెన్ రబ్  గ్యెల్ లింగ్ “. దీనిని త్సోనాగొంట్సే మొనాస్టరీకి ప్రతిరూపకంగా నిర్మించారు. దీనిని పన్నెండో సోనా గొoటె రిపోచే 1965లో స్థాపించాడు. ఆయన పశ్చిమ కమెంగ్ లోని మోర్శింగ్ లో జన్మించాడు. 1966లో మరణించాడు. తర్వాత పదమూడవ సోనా గొంటె రెంపోచే దీనిని పునరుద్ధరించి, పెద్ద ప్రార్థనా హాలును నిర్మించాడు. 1997లో పధ్నాలుగవ దలైలామా దానిని ప్రారంభిoచాడుఎరుపు, తెలుపు, పసుపు రంగులతో టిబెటన్ బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించేలోగా దీని నిర్మాణం ఉంది. లోపల హాలులో బంగారు పూత పూసిన శాక్యముని బుద్ధుని విగ్రహం ఉంది. మందిరం లోపలి గోడల పైన థాoగ్కా చిత్రాలు ఉన్నాయి. ఇవి బౌద్ధ పురాణాలను, తత్వాలను వివరిస్తాయి. ప్రార్థనా మందిరంలో చెక్క స్తంభాలు , కిటికీలు అతి సంక్లిష్టమైన టిబెటన్ హస్తకళా నైపుణ్యంతో అందంగా ఉన్నాయి. ఎదురుగా ఒక పెద్ద కంచుగంట ఉంది. బయట రాతి కారిడార్లలో రాగి ప్రార్థనా చక్రాలు ఉన్నాయి. భక్తులు వీటిని సవ్యదిశలో తిప్పుతూ ప్రదక్షిణలు చేస్తారు.

మొనాస్టరీలో అప్పర్, మిడిల్, లోయర్ గొంపాలని మూడు భాగాలున్నాయి. అప్పర్ గొంపాలో ప్రార్థనలు, దర్శనాలు, పర్యాటకులను అనుమతిస్తారు, మిడిల్ గొంపా సీనియర్, జూనియర్ లామాల నివాస ప్రదేశం. ఇక్కడ చిన్న లామాలకు బౌద్ధ శాస్త్రం బోధిస్తారు. ప్రాంగణంలో చిన్న చిన్న బౌద్ధసన్యాసులు ( పిల్లలు ) హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. లోయర్ గొంపాలో స్థానిక ముంపా జాతి ప్రజల పూజలు జరుగుతాయట. మిడిల్, లోయర్ గొంపాలలోకి పర్యాటకులకు అనుమతి లేదు. పైనుంచి చూసినప్పుడు కింద బొమిడిలా లోయ, చుట్టూ పర్వతాలు, పైన మేఘాలు ప్రకృతి చిత్రించిన అందమైన చిత్రపటంలా అందంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, అందమైన పరిసరాలతో నిండిన ప్రదేశాన్ని వదిలి వెళ్ళబుద్ధి కాదు, ఎంతసేపని ఉంటాం? కదలక తప్పలేదు.

మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. సంగెటి వ్యాలీ దగ్గర ఆగాం. సుమారు పదమూడువేల అడుగుల ఎత్తులో ఉన్న వ్యూ పాయింట్ ఇది. ఇక్కడినుంచి చూస్తే బూమ్లాపాస్ లో వున్న ఇండో చైనా బార్డర్ లోని బంకర్స్ కనిపిస్తాయి. చుట్టూ తూర్పు హిమాలయ పర్వతశ్రేణులు, వాటిని చుంబిస్తున్న మేఘమాలికలు, కనుచూపు మేర పచ్చదనంతో ప్రకృతి సింగారించుకున్నట్లుగా ఉంది. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ముందుకు పోయాం. దారి అంతటా బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు బండరాళ్ళపై రాసిన హెచ్చరిక నినాదాలు ఇంగ్లీషులో కనిపించి ప్రయాణీకులను ఆలోచింప జేస్తాయి . మచ్చుకు కొన్ని .” రోడ్ ఈజ్ హిల్లీ డోంట్ డ్రైవ్ సిల్లీ “, ” అలర్ట్ టుడే అలైవ్ టుమారో ,” ” డొనేట్ బ్లెడ్ బట్ నాట్ ఆన్ రోడ్ .” అనేవి కొన్నిమొదటి రోజు ప్రణాళికలో ఉన్న సెరిగాన్ యాపిల్ గార్డెన్ ను మేం చివరి రోజు చూశాం. కాశ్మీర్ పర్యటనలో చెట్టు ఎక్కి యాపిల్ పండ్లు తెంపు కుంటే .. ఇక్కడ పూత, పిందె దశలో చూసాను. కివి పండ్ల తోటలు కూడా కనిపించాయి. కివి పళ్లతో చేసిన వైన్ స్థానికంగా ప్రత్యేకమైందని తెలిసి కొనుగోలు చేశాం. అరలీటర్ ఐదు వందల రూపాయల ఖరీదు. అక్కడి నుంచి ప్రాంతంలో మాత్రమే లభించే ప్రత్యేకమైన ట్రౌట్ చేపల పెంపకo కేంద్రానికి వెళ్ళాం. వాటి ధర కూడా ఎక్కువే అని రాహుల్ చెప్పాడు. అస్సాం రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించే సరికి పెద్ద పెద్ద పర్వతాలు కనుమరుగయ్యాయి. అడవి అరటి తోటలు విస్తారంగా కనిపించాయి. క్యాబేజీ సాగు కూడా కనిపించింది. గౌహతిలో బ్రహ్మపుత్ర నది వంతెన దాటుకొని హోటల్ కు చేరుకునే సరికి రాత్రి తొమ్మిదియింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *