– రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ సీఈఓ శ్రీధర్
– ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్న సంస్థ
సికింద్రాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: నాణ్యమైన క్యాన్సర్ వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే రెనోవా లక్ష్యమని శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు.‘రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్’ ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 14న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్. రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఇందివర్ కిరణ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన వైద్యం, అందుబాటు ధరల్లో చికిత్స, ఆధునిక వైద్య విధానాల అమలు, బహుళ విభాగాల (మల్టీడిసిప్లినరీ) సమన్వయంతో కూడిన ఆంకాలజీ సేవలను అందించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రోగులకు మెరుగైన చికిత్సా ఫలితాలు అందించేందుకు వైద్య సేవలను నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రెనోవా గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ యూనిట్ హెడ్ జనార్ధన్ నందిగాం మాట్లాడుతూ.. తమపై నిరంతర నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచిన రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. క్యాన్సర్‌పై పోరాటంలో రోగులు చూపే ధైర్యం, స్థైర్యం తమకు నిరంతర స్ఫూర్తినిస్తాయని, సేవా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే తమకు కొండంత బలమని అన్నారు.
క్యాన్సర్ చికిత్సలో అత్యుత్తమ ప్రమాణాలు, మానవీయ విలువలతో కూడిన వైద్య సేవలను అందిస్తూ కార్ఖానాలోని ‘రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్’ విజయవంతంగా ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 2021లో ప్రారంభమైన ఈ కేంద్రం, గత ఐదేళ్లలో అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యాధునిక వైద్య సాంకేతికత, నైతిక విలువలతో కూడిన చికిత్సా విధానాలతో విశ్వసనీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా గుర్తింపు పొందింది.లక్షకు పైగా ఓపీ సేవలు, 45 వేలకుపైగా ఇన్‌పేషెంట్ అడ్మిషన్లు, 36 వేలకుపైగా కీమోథెరపీ చికిత్సలు,3 వేలకుపైగా రేడియేషన్ చికిత్సలు అందించింది. ఆసుపత్రి అభివృద్ధికి, ఈ మైలురాళ్లను చేరుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆంకాలజిస్టులు, కన్సల్టెంట్లు, వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, మరింత ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, చికిత్సా సామర్థ్యాన్ని పెంపొందించడం, రోగులకు మెరుగైన ఫలితాలు అందించడం, నిబద్ధతతో సమాజానికి సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించింది.ఈ వేడుకల్లో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, పరిపాలనా విభాగాల ఉద్యోగులు పాల్గొని ఐదేళ్ల విజయ ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





