క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

– ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి
– బీమారం ఎస్ఆర్ డిజి పాఠశాలలో కన్నుల పండువగా బాలల దినోత్సవ వేడుకలు
– ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 14: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బీమారంలోని ఎస్ఆర్ డిజి పాఠశాలలో శని వారం బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయు లు, విద్యార్థుల సమన్వయంతో జరిగిన ఈ సంబరాలతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ముందు గా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పట్టుదలతోనే అద్భుత విజయాలు
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.ఆర్. విద్యా సంస్థల జోనల్ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ భాగ్యవిధాతలని కొనియాడారు. చాచా నెహ్రూకు పిల్లలంటే ఎనలేని ప్రేమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థు లు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, మంచి నడవడికను అలవర్చుకుంటే జీవితం లో ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా సులభంగా అధిరోహించవచ్చని పిలుపునిచ్చారు.

అంతర్గత ప్రతిభను గుర్తించాలి

పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తకాల చదువుకే పరిమితం కాకుండా సమయపాలన, పెద్దల పట్ల గౌరవం, సామాజిక స్పృహ, మంచి అలవాట్లలోనూ ముందుందాలని సూచించారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, ఆటపాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రాంగణమంతా చప్పట్లతో, ఆనందోత్సాహాల తో మార్మోగింది. అనంతరం, బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సౌజన్య చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *