పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరస్మరణీయుడు

– సీఎం రేవంత్ సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, టీపీపీసి చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మంత్రి సీతక్క సంతాపం

సుదర్శన్ రెడ్డి మరణం పట్ల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మరణం బాధాకరమని అన్న మంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

బీజేపీ చీఫ్ రామచందర్ రావు సంతాపం

సుదర్శన్ రెడ్డి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నర్సంపేట నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర విశిష్టమైనది. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొని శాసనసభ్యుడిగా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా గుర్తుండిపోతారు. తెలంగాణ ఉద్య మంలోనూ ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. పెద్ది మరణం నర్సంపేట ప్రజలకు, ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరికీ తీరని లోటు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, ఈ విషాదాన్ని తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం : మాజీ ఎమ్మెల్యే వొడితెల

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణ సమాజం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గొప్ప నాయకుడు అని, ఉద్యమ స్ఫూర్తిని గ్రావిÖణ స్థాయికి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారి అన్నారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పేర్కొంటూ తనతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను ఎన్నటికీ మరువలేమన్నారు. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, ఉద్యమ పట్ల అంకితభావంతో పనిచేసిన పెద్ది సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *