‘మూసీ’పై స్టే నిరాకరించినట్లు ఉత్తర్వులో లేదు

– మీడియా కథనాలపై అప్పీలుదారు డాక్టర్ బాబురావు వివరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అధికారిక ఉత్తర్వును ప్రతిబింబించడం లేదని అప్పీలుదారు డాక్టర్ కలపాల బాబు రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ ఎన్‌జిటి దక్షిణ మండలి, చెన్నైలో దాఖలు చేసిన అప్పీలు నం. 50/2026 (ఎస్‌జెడ్‌)పై బుధవారం ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. నవంబర్ 3న జారీ చేసిన ఉత్తర్వులో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం, వారి న్యాయవాదులు నోటీసులు స్వీకరించడం, సమాధానాల దాఖలుకు గడువు కోరడం వంటి ప్రక్రియపరమైన అంశాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా సమాధానాలు దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు. స్టే నిరాకరణ, ప్రాజెక్టుకు అనుకూల వ్యాఖ్యలు లేదా అప్పీలుదారునికి వ్యతిరేక నిర్ణయాలేవీ ఉత్తర్వులో లేవని బాబు రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలను ట్రిబ్యునల్ నిర్ణయాలుగా చూపడం తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నారు. అప్పీలు ఇంకా విచారణలో ఉందని, తన వాదనలను ట్రిబ్యునల్ ముందు ఉంచుతానని తెలిపారు. న్యాయస్థానాల వార్తలను ప్రచురించే ముందు అధికారిక ఉత్తర్వులను పరిశీలించాలని, రెండు పక్షాల వాదనలకు చోటివ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *