రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు

– రాజీవ్ హ‌నుమంతుకు ఫోన్‌లో మంత్రి పొంగులేటి పరామర్శ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రాజీవ్ హనుమంతును రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో రాజీవ్ హనుమంతుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. ఫోన్‌లో ఆయ‌న‌తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం ఆయనతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాజీవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని, అవసరమైన మెరుగైన వైద్య సేవలు పొందాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. హనుమంతు, ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *