– ఆయనకు అండగా నిలిచిన కేటీఆర్
– తెలంగాణ భవన్ లో ఆత్మీయ భేటీ
– స్వయం కృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్ పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ భవన్లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ బుధవారంమర్యాదపూర్వకంగా కలిశారు. 90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ ను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.శారీరక వైకల్యంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రకాంత్ సాగర్, వాటిని అధిగమిస్తూ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా, తన పరిశ్రమ ద్వారా దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్ సాగర్ తెలిపారు. కేటీఆర్ అండతో పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పిస్తున్నానని చంద్రకాంత్ సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు. స్వయంకృషితో ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు. దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





