– కేంద్ర మంత్రివర్గంలో కీలక పరిణామం
దిల్లీ, అక్టోబర్ 13 : కేంద్ర మంత్రివర్గ పున ర్వ్యవస్థీకరణ ఊహాగానాల నడుమ మోదీ కేబినెట్ లో అనూహ్య పరిణామం చోటుచేసు కుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహా య మంత్రి ఎల్.మురుగన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, తనను పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించిన మురుగన్ కేంద్ర కేబినెట్లో తనకు పనిచేసే అవకాశం కల్పించినందుకు జాతీయ నాయ కత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం మురుగన్ రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై మురుగన్ ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా తన రాజీనామా నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ స్థానం నుంచి తప్పుకొనేందుకు కూడా అనుమతివ్వాలని ప్రధాని మోదీని మురుగన్ కోరారు. మోదీ నాయకత్వంలో పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తు న్నట్లు ఆయన తెలిపారు. భరతమాతకు, తమిళనాడుకు సేవ చేయడం తన జీవితంలో గొప్ప విషయమన్నారు. తాను ఒక రోజువారీ కూలీ కార్మికుడి కొడుకు స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని చెప్పారు. ఇప్పుడు ఇంక తాను తిరిగి గ్రామస్థాయిలోకి వెళ్లి, బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పని చేస్తానని తెలిపారు. కార్యకర్తల కోసం నిలబతానని చెప్పారు. ముందు దేశం అని,
తర్వాత పార్టీ అని, ఆ తర్వాతే తాను అని పేర్కొన్నారు. మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టకముందు 2017-2020 వరకు జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ గా పని చేశారు. అలాగే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగానూ సేవలందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




