అమ్మ భయపడటం ఒక్కసారి కూడా చూడలేదు

– నాలుగుసార్లు క్యాన్సర్ ను జయించిన ధీర వనిత
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– సోనియా ఆత్మకథ బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణలో భావోద్వేగ ప్రసంగం

న్యూదిల్లీ, నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తన తల్లిలోని ధైర్యాన్ని గురించి గొప్పగా చెప్పారు. తన తల్లి సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకం ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడుతూ తన తల్లి ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగుసార్లు క్యాన్సర్ ను జయించిందని తెలిపారు. ఆమెలో ధైర్యం ఎక్కువని, తన తల్లి భయపడటాన్ని తాను తన జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదని రాహుల్ గాంధీ అన్నారు. తన తల్లి దశాబ్దాలుగా ఎదుర్కొన్న వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి కూడా మాట్లాడారు. తన పుస్తకంలో ఆమె ఈ విషయాలను తక్కువ చేసి చూపినప్పటికీ వాస్తవానికి ఆమె నాలుగుసార్లు క్యాన్సర్ ను జయించిందని తెలిపాడు. అమ్మ రాసిన పుస్తకంలో మీరు చదువుతున్నది నాన్న చనిపోక ముందు అమ్మ గురించి అని, ఆ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. అమ్మానాన్నలు నిన్ను ఎంతో ప్రేమించారు.. నాన్న నిన్ను చూసి ఎంత గర్వపడేవారో నేను మాటల్లో చెప్పలేను అని వేదికపై ఉన్న తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రాను ఉద్దేశించి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *