ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం

– యువకుడి ఆత్మహత్య

సంగారెడ్డి, సెప్టెంబర్ 30: ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. బొంతపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ 23) ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కొన్ని నెలలుగా బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.9 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అతను మానసికంగా కూడా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గుమ్మడిదల పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీకాంత్ బెట్టింగ్‌లకు అలవాటు పడటం, అందులో భారీగా డబ్బు నష్టపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *