– పోలీసుల దర్యాప్తు
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 6 : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో అమెరికా దేశస్థుడు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) ఎస్ఎల్ఎన్ టెర్మినస్లోని మారియట్ ఎగ్జి క్యూటివ్ అపార్ట్మెంట్స్ లో మృతిచెందాడు. వ్యాపార పనుల నిమిత్తం మిచెల్ బ్రియాన్ లీ తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వుతో కలిసి ఈ నెల 2న హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరూ హోటల్లో బస చేస్తున్నారు. ఈ నెల 4న సాయంత్రం నుంచి మిచెల్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది గురువారం సాయంత్రం అతని గదిని పరిశీలించారు. 12వ అంతస్తులోని 1218వ గదిలో మిచెల్ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108కు సమాచారం ఇవ్వగా వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిచెల్ మృతికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




