జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 6: వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చు రేపింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన కట్టుకున్న భార్తనే హత్యకు పాల్పడింది. గొల్లబుద్దారం తండాకు చెందిన చందు (40), పావనిలకు 2014లో వివాహం జరిగింది. వీరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పావనికి దరావత్ సంతోష్‌తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో భర్త తమకు అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం రాత్రి ప్రియుడు సంతోష్‌ను ఇంటికి పిలిచి ఇద్దరూ కలిసి చందును హత్య చేశారు. అనంతరం సంచిలో మూటకట్టి సమీప గ్రామం దగ్గర రోడ్డు వద్ద పడేశారు. అటుగా వస్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పావని, సంతోష్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




