– మొయినాబాద్ టీపీఓ వాణిపై ఏసీబీ కేసు నమోదు
– 8 మంది బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు
– రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
– విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణ గుండు వాణి పై అక్రమ ఆస్తుల కేసు నమోదయ్యింది. ఏసీబీ అధికారులు సోమవారం టీపీవో ఇంటితో పాటు కార్యాలయం, ఆమెకు సంబంధించిన 8 మంది బంధువులు, బినామీదారుల ఇండ్లపై దాడులు జరిపి విలువైన డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జడ్చర్ల, జనగాం జిల్లా పాలకుర్తిలో రెండు ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, జీ ప్లస్ టూ బిల్డింగ్, కోయిల్ కొండ మండలంలో ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించా మని వివరించారు. రూ.5.47 లక్షల నగదు. రూ.8 లక్షలు బ్యాంక్ బ్యాలె న్స్, 175 గ్రాముల బంగారు ఆభరణాలు, వాహనాలు ఉన్నాయని తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.6.76 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఉద్యోగ సమయంలో అక్రమంగా సంపాదించినట్లు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. టీపీవో గత నెల 30న పంచాయతీకార్యదర్శి నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




