– 16 మంది అరెస్ట్, మరో 12 మంది పరార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో భారీ పేకాట శిబిరంపై గోషామహల్ పోలీసులు దాడి చేసి 16మందిని అరెస్టు చేశారు. ధనలక్ష్మి ఫిష్ గోదాంలో పేకాట దందా సాగుతోంది. అందర్, బాహర్, తీన్‌పత్తి పేరుతో రెండు గదుల్లో జూదం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో గోషామహల్ పోలీసులు అర్ధరాత్రి వేళ దాడి జరిపారు. జూదం ఆడుతున్న ఈ కేసులో గుల్జన్ సింగ్, అంకిత్ సింగ్, విజయ్ రాజ్ సింగ్, వికాస్ బిరాదార్ సాహ్ మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు గోషామహల్ సీఐ బి.శ్రావణ్ కుమార్ తెలిపారు. వీరిలో కొందరు బేగంబజార్, ఫిష్ మార్కెట్ పరిసరాల్లో నివసిస్తుండగా మరికొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించామన్నారు. మరో 12మంది పరారవ్వగా వారి కోసం గాలిస్తున్నారు. రూ.23,800 నగదును, మూడు సెట్ల పేకలను జప్తు చేశారు. నలుగురు నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు నమోదు చేశారు. వాణిజ్య సముదాయాలు, గోదాముల యజమానులు తమ ప్రాంగణాలను ఇలాంటి కార్యకలాపాలకు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




