18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌

– ఉస్మానియా వైద్యులకు మంత్రి దామోదర్‌ అభినందన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30: ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌లో అరుదైన లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ‌జరిగింది. గ్లైకోజెన్‌ ‌స్టోరేజ్‌ ‌సమస్యతో బాధపడుతున్న 18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాబుకి లివర్‌ ‌మార్పిడి చేశారు. తండ్రి లివర్‌ ‌నుంచి కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. 14 గంటల పాటు క్లిష్ట శస్త్రచికిత్స కొనసాగింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా డాక్టర్లు చికిత్స అందజేశారు. దేశంలో ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత అరుదని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్యుల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *