కేయూ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ పదవీ కాలం పొడిగింపు

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్, విద్యా విభాగం విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ నల్లాని శ్రీనివాస్ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామ చంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యా విభాగంలో బోధన, అభ్యసనం, పరిశోధన, విద్యా ర్థుల సమగ్ర అభివృద్ధికి పలు కార్యక్రమా లు చేపట్టారు. ఈ కాలంలో ఎం.ఎడ్ లో నాలు గు, బి.ఎడ్ లో ఎనిమిది సెమిస్టర్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో మరో ఏడాది పదవీకాలం పొడిగించిన వీసీ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంలకు డాక్టర్ నల్లాని కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో సహకరించిన అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *