ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో) స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. నగరంలోని ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ హాస్పిటల్‌ను తిరిగి తెరవడానికి అవసరమైన అనుమతుల మంజూరుకు డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి రూ. 2లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ దీనిపై  ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. బాధితుడు ముందుగా రూ.లక్ష లంచం డబ్బులు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేస్తుండగా అధికారులు దాడి చేసి ఆయనను, డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని, డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
—————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *