హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: రాబోయే ఎన్నికలకు సమన్వయంతో సిద్ధమవ్వడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని జేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమావేశం గురువారం జరిగింది. రామచందర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీ నాయకత్వానికి, వివిధ మోర్చాలకు మధ్య సమన్వయాన్ని మరింత పెంచడంపై నాయకులు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల కార్యక్రమాల్లో అన్ని మోర్చాలు చురుగ్గా పాల్గొనేలా చూడటంపై దృష్టి సారించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
గడ్కరీతో రామచందర్‌రావు భేటీ
కాగా, ఇండియన్ రోడ్సు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ ఎన్.రామచందర్ రావు హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




