– పోర్జరీతో సోదరుడు భూమి అక్రమించుకున్నాడు
– 2003నుంచి ‘ప్రజావాణి’లో ఫిర్యాదులు
– 2003నుంచి ‘ప్రజావాణి’లో ఫిర్యాదులు
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తన సంతకాన్ని పోర్జరీ చేసిన సోదరుడు తన భూమిని కబ్జా చేశాడంటూ ఇరవయ్యేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసి విసిగి వేసారిన ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం రేగింది. దుగ్గొండి మండలం పొనకల్లు గ్రామానికి చెందిన గట్ల సురేందర్ తన సోదరుడు గట్ల రాజు తన సంతకం ఫోర్జరీ చేసి తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ 2003లో అధికారులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఫోర్జరీలో అధికారుల తప్పు ఏమీ లేదని, కేసు కోర్టు విచారణలో ఉన్నందున తాము ఏమీ చేయలేమంటూ అధికారులు పట్టించుకోవడం లేదని సురేందర్ ఆరోపిస్తున్నారు. అధికారులు సహకరించడం వల్లనే తన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ పలుమార్లు గ్రీవన్స్లలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో ఒకసారి ఎడ్లబండిపై వచ్చి వినతి పత్రం సమర్పించాడు. ఇటీవల హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు కూడా. దీనిపై అధికారులు అప్పటినుంచి ఇప్పటివరకు ఒకే మాటపై ఉండడంతో మనస్తాపానికి గురైన సురేందర్ సోమవారం ప్రజావాణి జరిగే కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని అదపులోకి తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ ముందు హాజరుపర్చడంతో భూమి విషయం కోర్టు విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని నచ్చజెప్పి పంపించారు.
—————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




