– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్ విమర్శ
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ తనను క్రాస్ బ్రీడ్ నాయకుడని కేటీఆర్ సంబోధించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ’నేను రాజకీయ వ్యభిచారినైతే నువ్వు వ్యభిచార కొంప నడిపావా? గతంలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్న నీదా క్రాస్ బ్రీడ్.. నాదా.. అని కేటీఆర్‌ను నిలదీశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్‌ను నిలబెట్టి జీవన్‌రెడ్డికి క్రాస్ వోటేయించిన క్రాస్ బ్రీడ్ నాయకుడు కేటీఆర్.. అక్రమ సంపాదనతో వొచ్చిన అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ అహంకారపూరిత వ్యాఖ్యలతోనే రాష్ట్రంలో వెలమ జాతి గౌరవం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తాను, తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నామన్న సంజయ్.. రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులు తగ్గాయే తప్ప పెరగలేదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





