– సైబరాబాద్ సీపీ రమేశ్ ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత పెంచుతూ సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో గుమిగూడ{ంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపులుగా ఉండటం నిషేధమని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేస్తున్నామన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని వెల్లడించారు. పోలీస్, సైనిక సిబ్బంది, హోం గార్డులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. విద్యాశాఖ ప్లయింగ్ స్క్వాడ్ విధులకు అనుమతి ఉంటుందని, అలాగే అంత్యక్రియల ఊరేగింపులకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ రమేశ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





