ఘనంగా కిట్స్ ప్రొఫెసర్ శివాని పదవీ విరమణ

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐఈ) ప్రొఫెసర్ డాక్టర్ కె.శివాని పదవీ విరమణ మహోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ శివాని డీన్ అకడమిక్ అఫైర్స్, ఈసీఐ డిపార్ట్‌మెంట్ హెడ్, ఇతర కళాశాల ప్రిన్సిపాల్‌గా, ప్రొఫెసర్ ఐ/సి హెచఎంపీ వంటి వివిధ హోదాల్లో సేవలందించారని తెలిపారు. ఆమె ఏ పదవిలో ఉన్నా గొప్ప నిబద్ధత, అంకితభావంతో పనిచేశారని, సమయపాలన పాటించే విశిష్టమైన కెరీర్ గలవారని, మంచి అధ్యాపకురాలు, నిర్వాహకురాలు అని కొనియాడారు. డిపార్ట్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్‌కు ఆమె చేసిన కృషి అద్భుతమైనదన్నారు. మహిళా సాధికారతకు ఉత్తమ నాయకురాలున్నారు. ఆమె నైతికంగా బలంగా మరియు సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. కార్యక్రమంలో కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్, ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, ఇసిఐ విభాగాధిపతి ఎమ్.రఘురామ్, స్టాఫ్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ప్రెసిడెంట్ సిఎసఈ ప్రొఫెసర్ పి.నిరంజన్, సెక్రటరీ డాక్టర్ ఎ.హరికుమార్, కోశాధికారి డాక్టర్ కెప్టెన్ ఎం.రణధీర్ కుమార్, కిట్స్ అధ్యాపకుల అసోసియేషన్(కిట్‌స్టా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.శ్రీధర్, కిట్‌స్టా జనరల్ సెక్రటరీ అండ్ హెడ్ ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బ, పావని, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శ్రీలత, డాక్టర్ శివాని బంధువులు, డీన్లు, అన్ని విభాగాల అధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆరఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ శివానికి భవిష్యత్ జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *