దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో న‌వ్య‌ కాంతులు వెల‌గాలి..

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  దీపావళి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  ఈ దీపావ‌ళి పండుగ  ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతులు, స‌మృద్ధిని అందించాల‌ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా హిందువుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే దీపావళి పండుగ అని,  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు.

అమావాస్య చీకటిలో దీపాల వెలుగులు విరజిమ్ముతున్నట్లే.. ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లోనూ నవ్య కాంతులు తీసుకురావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. జీవితమంటేనే చీకటి వెలుగుల సమాహారం. దీపావళి నేర్పే పాఠం ఇదే. ప్రతి మనిషి జీవన ప్రయాణం అజ్ఞానాన్ని పారద్రోలే చైతన్యకాంతుల దిశగా సాగిపోవాలని, ఆత్మీయతలు, అనుబంధాల వేడుకగా జ్ఞానకాంతులు వెదజల్లే సందర్భంగా ఈ దీపావళి నిలిచిపోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *