తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా?
ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు పదవులు సంపాదన ఒనగూర్చే వ్యవస్థలన్నీ మీ కుటుంబానికి చెందే విధంగా పార్టీ నిర్మాణం చేసి భారత రాష్ట్ర సమితి అని
పేరు పెట్టుకున్నావు అది కేవలం మూడు సంవత్సరాలు మాత్రము పూర్తికాలేదు ఇది టిఆర్ఎస్ ఆవిర్భావ సభలు ఎలా అవుతాయో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా అని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారూ. ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు పక్కకు పెట్టి దొరల పాలన అమలుచేసి బిసి ఎస్సీ ఎస్టీ వర్గాలను తీవ్ర నిర్బంధాలకు అణిచివేతకు వివక్షతకు గురిచేశావు. ఎలుకతుర్తి సభలో ఈ దళిత బహుజన వర్గాలకు ఏం సమాధానం చెప్తావు? బంగారు తెలంగాణ నిర్మిస్తానని తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసే ఆర్థిక రాజకీయ సామాజిక అణిచివేతలు చేసింది నిజం కాదా?
అధికారం రాగానే త్యాగాలు చేసిన ఉద్యమకారులను నాయకులను పక్కకు అవమానాల పాలు చేసి కార్పొరేట్ సంస్థల యజమానులను చేరదీసి రాష్ట్ర వనరులను వ్యాపారాలను విద్య వైద్య సంస్థలను అప్పజెప్పి తెలంగాణ ప్రజలను దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది నిజం కాదా? ప్రభుత్వ విద్య వైద్య సంస్థలను నీరుగార్చి బంధువుల స్నేహితుల ప్రైవేటు విద్యా వైద్య సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఈయలేదా? స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ తగ్గించి క్యాబినెట్లో చట్టసభలలో బీసీల ప్రాతినిధ్యం తగ్గించి మంచి వేయలేదా? దళితుల మహిళల యువకుల, పాత్రికేయుల పట్ల తీవ్ర నిర్బంధాలను అమలు చేయలేదా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి తెలంగాణ ప్రజల డబ్బును బారాస పార్టీ విస్తరణకు ఖర్చుపెట్టి హర్యానా పంజాబ్ మహారాష్ట్ర రైతులకు నాయకులకు తెలంగాణ ప్రజల డబ్బు వసూలు చేసి పంపలేదా?
ధరణి హోటల్ ద్వారా వేలాది ఎకరాలను సంపాదించు కోవడం 8 లక్షల కోట్ల అప్పులు చేసి అక్కరకురాని ప్రాజెక్టులకు ఖర్చుపెట్టి అవినీతికి పాల్పడి కుటుంబానికి సమీప బంధువులకు వేల కోట్ల రూపాయలు దేశ విదేశాల్లో ఆస్తులను సంపాదించి పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి అప్పుల చిప్ప చేతికి ఇవ్వలేదా? నిజాం కాలంలో అమలు చేసిన నిర్బంధ అద్భుతలను అమలుచేసి పోలీస్ శాఖ నుండి పదవీ విరమణ చేసి విశ్రాంతి పొందుతున్న బంధువులను తిరిగి ఫోన్ టాపింగ్ బాధ్యతలు ఇచ్చి సినిమా యాక్టర్లను రాజకీయ ప్రత్యర్థులను కార్పొరేట్ సంస్థల యజమానులను వ్యాపారులను ఉద్యమకారులను వెంటాడింది నిజము కాదా?
కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులు అనేక అవినీతి స్కామ్లలో ఇరుక్కుని మోడీ భజన చేసి నిర్బంధాలు ఏర్పడకుండా శిక్ష పడకుండా కాపాడుకుంటున్నది నిజము కాదా? అనేక తప్పిదాలు చేసి తెలంగాణ దళిత బహుజనులను అణిచివేసి తీవ్ర వివక్షతకు గురిచేసి నయా నైజాం పాలన అమలు చేసి ఇప్పుడు రజిత ఉత్సవాలు చేస్తున్నానని చెప్తున్నావు మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఎవరికి తాకట్టు పెడతావు ఎంత ముంచుతావు ? రాష్ట్రాన్ని నీ కుమారునికి ధారాధత్తము చేసే కుట్ర అని ఎందుకు భావించకూడదు, మరీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దొరల రాజ్యంగా స్త్రీకరించడానికా అని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు?
ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల వేదిక