కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన

– ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆమె పెట్టుకున్న పేర్లలో ఈ పేరును ఖరారు చేసింది. దీనిపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ‘ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం.. మూడో ప్రాధాన్యంగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించింది.. టీఆరఎస్.. నాకు రాసిపెట్టి ఉందేమో.. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తా.. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తా‘ అని కవిత ’ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ఈ నెల 25న కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్‌ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కవితకు ఈసీ సూచించింది. అదేవిధంగా కొత్త పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *