కులగణన సర్వేతో అన్ని వర్గాలకు న్యాయం

ర‌వాణాబీసీ సంక్షేమ‌శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
దుష్ప్రచారాలను నమ్మొద్దని హితవు

‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన  తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎం‌సీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని..  150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్‌ ‌సర్వే వివరాలు తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్‌ అం‌టిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. ఈ సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్రవ్యప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని.. సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు నియమించామన్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకుపైగా ఎన్యుమరేటర్లు నియమించామని తెలిపారు.

ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్‌లో న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కొందరు ఈ సర్వేను రాజకీయం చేయాలని చూస్తున్నారని.. వారి మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు తనను అడగాలన్నారు. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్‌ అవుతుందని తెలిపారు. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు.

ఆధార్‌ ‌కార్డు వివరాలు ఆప్షనల్‌ ‌మాత్రమే అని స్పష్టం చేశారు. ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమానిక మేయర్‌ ‌విజయలక్ష్మిడిప్యూటీ మేయర్‌ ‌హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ అనుదీప్‌‌జీహెచ్‌ఎం‌సీ అధికారులు పాల్గొన్నారు.  కాగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో సర్వే కోసం 18, 723 మంది ఇన్యుమరెటర్లు, 1870 మంది సూపర్‌ ‌వైజర్లను ప్రభుత్వం నియమించింది. గ్రేటర్‌లో నేటి నుంచి 8 వరకు అంటే.. రెండు రోజుల పాటు మొదట ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *