- ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా
- పాలమూరును ఎండబెట్టిన ఘనులని జూపల్లి విమర్శలు
పాలమూరు ప్రాజెక్టులపై గత బిఆర్‌ఎస్ అబద్దాలుచెబుతోందని, ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్ నేతలు ఆరితేరారని మండిపడ్డారు. నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. పాలమూరును ఎండబెట్టి ఇవ్వాళ్ల నీతులు చెబుతున్నారని అన్నారు. దమ్ముంటే నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు.
రైతులను మోసం చేసి వారి గురించి మాట్లాడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కెటిఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు వారి గురించి కెటిఆర్ కన్నీరు ఒలకబోస్తున్నారుని పెద్దపల్లి ఎమ్మెల్యే మండిపడ్డారు.కౌలురైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మరో ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో కరీంనగర్‌కు చుక్కనీరు రాలేదన్నారు. కాళేశ్వరం పేరుతో అడ్డంగా దోచుకున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గతంలో కట్టిన ప్రాజెక్టులే శరణ్యమయ్యాయని అన్నారు. అంతకుముందు రైతుభరోసాపై కెటిఆర్ మాట్లాడగా పలువురు సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు.