గోల్డ్ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణం షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి చొరబడిన దొంగలు షో కేస్ అద్దాలను పగలగొట్టి విలువైన ఆభరణాలను అపహరించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సోమవారం ఉదయం షాపునకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి షాపులో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవేపై బోడుప్పల్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ షోరూమ్‌లో చోరీ జరిగినట్లు పోలీసులు, మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షోరూమ్‌లోని డిస్‌ప్లే గ్లాస్‌లను పగలగొట్టి.. అందులో ప్రదర్శనకు ఉంచిన వజ్రాభరణాలు, బంగారు నగలను తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఏడుగురు దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *