- తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా
- ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోయాక, కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీ నుంచి మొదలు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9వ తేదీ వరకు.. ప్రజా విజయోజ్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను.. ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను… అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి… డిసెంబర్ 7, 2023 నాడు.. తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.
తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా… సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. ఆక్షణం నుంచి… జన సేవకుడిగా… ప్రజా సంక్షేమ శ్రామికుడిగా… మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో… సకల జనహితమే పరమావధిగా… జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా… సహచరుల సహకారంతో… జనహితుల ప్రోత్సాహంతో… విమర్శలను సహిస్తూ… విద్వేషాలను ఎదురిస్తూ… స్వేచ్ఛకు రెక్కలు తొడిగి… ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి… అవనిపై అగ్ర భాగాన ? తెలంగాణను నిలిపేందుకు… గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ…నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ… నిరంతరం జ్వలించే.. ఈ మట్టి చ్కెతన్యమే స్ఫూర్తిగా… విరామం ఎరుగక… విశ్రాంతి కోరక…ముందుకు సాగిపోతున్నాను. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి… సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు





