– కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచడంతోపాటు వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆడిటోరియంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీజీఎస్ఏసీఎస్) సహకారంతో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా టీజీఎస్ఏసీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కె.విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు దేశంలో హెచ్‌ఐవి పరిస్థితి, గణాంకాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను, హెచ్‌ఐవీ వ్యక్తుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాల్సిన అవసరం గురించి వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని సూచించారు. గౌరవ అతిథి, కిమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్స్) డాక్టర్ ఎస్.మణిమాలారావు మాట్లాడుతూ హెచ్ ఐవీతో జీవిస్తున్న వారికి సేవలందించేటప్పుడు నర్సింగ్ విద్యార్థులు మానవతా దృక్పథం, వృత్తి నైపుణ్యం, నైతిక విలువలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు పోస్టర్ ప్రదర్శనలు, స్కిట్, క్విజ్ పోటీల ద్వారా హెచ్ఐవి నివారణ, అవగాహన, సామాజిక బాధ్యతకు సంబంధించిన ముఖ్య సందేశాలను ప్రజలకు చేరేలా వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, టీజీఎస్ఏసీఎస్ ప్రతినిధులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





