రేపు భద్రాద్రికి గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌

‌రామాలయంలో ప్రత్యేక పూజలు.. కొత్తగూడెంలో అధికారులతో సమావేశం

భద్రాచలం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23 : ‌తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ 25‌న  శుక్రవారం నాడు భద్రాచలం రానున్నారు. భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. 24వ తేది గురువారం సూర్యపేట నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి అతిధి గృహంలో రాత్రి బస చేస్తారు. ఉదయం 8.30 గంటలకు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంకు చేరుకుంటారు.

అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం కొత్తగూడెం చేరుకుంటారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికార యంత్రాంగంతో  ప్రత్యేక సమావేశం అవుతారు. అనంతరం రాష్ట్ర , జాతీయ స్థాయికి చెందిన ప్రముఖ కళాకారులు,  రచయితలు, కవులతో గవర్నర్‌ ‌భేటి అవుతారు. తదుపరి నేరుగా ఖమ్మం చేరుకుని అక్కడ ఉన్న ఎన్‌ఎస్‌వి అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడ భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుని కలెక్టర్‌ ‌కార్యాలయంలో అధికారులతో సమావేశం అవుతారు. 7.30 గంటలకు హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *