తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తల్లులకు ప్రత్యేక పూజలు చేసి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ ల ప్రాశస్త్యం గురించి గవర్నర్ కు వివరించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి, గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్లు, ఇతర అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. ఆయన వెంట మంత్రి సీతక్క తోపాటు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఏటూరునాగారం, ఐటీడిఏ పిఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరిష్, తదితరులు ఉన్నారు.