పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త

– పుట్టిన రోజు, పెళ్లి రోజున ప్రత్యేక సెలవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి.శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతీ పోలీసు ఉద్యోగికి వారి పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించి వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమైన సందర్భాలను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. డీజీపీ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *