సోషల్‌ ‌మీడియా ట్రోలింగ్‌ ‌సరికాదు

కొండా సురేఖపై ట్రోల్స్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ ‌మీడియాలో ట్రోలింగ్‌ ‌జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘ భారాస అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్‌ ‌డియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్‌ ‌డియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా‘ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *