ములుగు నుంచి తొలి అడుగు..

– రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు జిల్లా వేదిక
– రూ.16,007 కోట్ల భారీ ప్రణాళికకు ఈనెల 16న శ్రీకారం
-పైలాన్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల మధ్య మెరుగైన అనుసం ధానం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టనున్న భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ఈ నెల 16న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గుర్తుగా ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొలి దశలో 2,145 రహదా రులను సుమారు 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఆర్ధిక వన రులను సమకూర్చుకొని ఈ భారీ రహదారి కార్యక్రమాన్ని క్షేత్రస్థా యిలో కార్యరూపంలోకి తీసుకురానున్నారు. రహదారుల నిర్మాణా న్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు సంబంధిత నిర్మాణ సంస్థలే రహదారుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బృహత్తర రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ములుగు జిల్లా వేదిక కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచే ఆమె శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం విశేషం. అటవీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లాను ప్రారంభవేదికగా ఎంపిక చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల రహదారి అనుసంధానానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *