“ ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉపయోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది. భారతదేశ రాజధాని న్యూదిల్లీలో ఆందోళనకారుల మీద పెల్లెట్ గన్స్ ప్రయోగం బహుశా చరిత్రలో ఇంతవరకూ జరగలేదేమో. ..”
(ఆమీర్ మాలిక్ దిల్లీ జర్నలిస్టు)
‘అతను (హోమ్ మంత్రి) విద్యార్థుల రక్తంలోకి బుల్లెట్లను దించాడు’ -ఈ ఏడాది జులై 20న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారుల మీద అమిత్ షా క్రూర బలప్రయోగం చేయించాడనే ఆరోపణ గురించి లోక్ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అన్న మాటలు ఇవి.

దిల్లీ జర్నలిస్టు)
మొత్తం చరిత్రలోనే దేశంలోని పోలీసు బలగాలకు అధిపతి అయిన ఏ హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షా ఎదుర్కొన్నలాంటి వ్యాఖ్యను ఎదుర్కొని ఉండడు. భారతదేశ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ చేసిన ఈ ఏకవాక్య వ్యాఖ్య ఎంత శక్తివంతంగా, ఎంత రెచ్చగొట్టే విధంగా వున్నప్పటికీ బహు అందమైన రూపంతో వుంది. అమిత్ షా జీవితమంతా హింసతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం వున్నప్పటికీ -అనుచర స్థాయి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుడిభుజంగా మారాడు ఆయన. “ఈ మనిషి ఎందుకు ఇంకా బయట వున్నాడు?” అంటూ ప్రముఖ పత్రిక తెహెల్కా కవర్ పేజీని ఆక్రమించిటం దగ్గర నుండి నేర విచారణ సంస్థల నోరు నొక్కటం, జర్నలిస్టులూ న్యాయస్థానాలను గొంతెత్తకుండా చేయటం దాకా అమిత్ షా గొప్ప విజయం సాధించాడు. హింసతో అతనికున్న సంబంధం అత్యంత విస్తృతమైనది, కాకపోతే అన్నింటినీ మించిపోయేంత బలమైనది. అందుకే హింసా పద్దతులనూ, అమిత్ షాను కలిపి యూనివర్శిటీలలో విద్యాసంబంధిత కోర్సులుగా ప్రవేశపెట్టాల్సిన అవసరం వుంది. ఈ రెండు విషయాలు చాలా దగ్గర సంబంధంతో ఉంటాయి, నిర్లక్ష్యం చేయలేనంత ప్రాముఖ్యమైనవి.
ఒకప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్లక్ష్యం చేసిన గుజరాత్ కి చెందిన ఈ వ్యక్తి ఈ రోజు ఆ సంస్థనంతా కమ్ముకొని వున్నాడు. అతని మనుషులు ఆ సంస్థ ఎగువ స్థానాల్లో పీఠం వేసి వున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడూ న్యాయస్థానం ముందు నిల్చోలేదు. అతని మీద పెట్టిన కేసులు ముందుకు పోలేదు. అతన్ని న్యాయస్థానం ముందు నిలబడాలని అడిగిన వారికి కూడా జస్టిస్ లోయ గతే పడుతుందని భయపడతారు. అమిత్ షా హోమ్ మినిస్టర్ స్థానాన్ని ఆక్రమించినప్పటి నుండీ, అతని పెద్దన్న పాత్ర మొదలైనప్పటి నుండీ -అతని కళ్లు దాదాపు అందరి మీదా ఉన్నాయి. ప్రజల్లో భయాందోళనలనీ, భయభ్రాంతుల మానసిక స్థితినీ సృష్టిస్తూ, బ్రిటిష్ ఇండియా పద్దతుల్లో పరిపాలన కొనసాగించటంలో సఫలీకృతుడు అయ్యాడు.
అతను సృష్టించిన భయం అనే బుడగ అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది.అతన్ని ప్రశ్నించిన వారిని జైళ్లలో వేశాడు. అమిత్ షా ఇంకా ఎందుకు బయట ఉన్నాడు అని అడిగినందుకే చాలామంది కటకటాల వెనుక ఇంకా కునారిల్లుతున్నారు. తనకుతాను అత్యంత పవిత్రంగా చెప్పుకొంటూ, తన మీద ఎవరూ ప్రశ్నలు సంధించరాదని భావిస్తాడతను. “ఇతను ఇంకా ఎందుకు బయట వున్నాడు?” అనే ప్రశ్న ఇప్పుడు “అమిత్ షా ఎందుకు పార్లమెంటుకు రావటం లేదు?” అనే అదే మాదిరి ప్రశ్నగా మారింది. దానికి సమాధానం అప్పుడు ఏ హింసలో అయితే దాగుందో, ఇప్పుడూ అదే హింసలో దాగివుంది. ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉప యోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది. భారతదేశ రాజధాని న్యూదిల్లీలో ఆందోళనకారుల మీద పెల్లెట్ గన్స్ ప్రయోగం బహుశా చరిత్రలో ఇంతవరకూ జరగలేదేమో.
తుపాకి రాజ్యం
2010లో మొదటిగా జన సమూహాన్ని నియంత్రణ చేసే పరికరంగా జమ్మూకశ్మీర్ లో ఆ రాష్ట్ర పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీసు వాళ్లు పెల్లెట్ గన్ ను వాడారు. ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం కమ్యూనిస్టు ‘అతివాదులను’ నియంత్రించటానికి కూడా ఉపయోగించారు. పెల్లెట్ తుపాకీలను బ్రిటిష్ వాళ్లు పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించిన ఫ్యాక్టరీలో తయారు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడది అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్ మెంట్ ఇండియా లిమిటెడ్ కింద పని చేస్తోంది. బ్రిటిష్ వాళ్లు 1787లో ప్రారంభించింది 2026 వరకూ కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీ భారతీయ సాయుధదళాలకు అవసరమైన తుపాకీలు అందచేస్తున్నప్పటికీ, చైతన్యవంతులను చేయటం ద్వారా కాకుండా తుపాకీల ద్వారా ప్రజలను అదుపు చేయాలనే బ్రిటిష్ వాళ్ల మనస్తత్వాన్ని అది ప్రతిబింబిస్తోంది అనే వాస్తవం కాదనలేనిది.
“గాలి తుపాకీలు పెద్దఎత్తున గాయాలను సృష్టిస్తాయి. పెల్లెట్ తుపాకీలు కండరాలలోకి లోతుగా చొచ్చుకొనిపోయి ప్రాణాంతకమైన గాయాలను చేస్తాయి” అని సైన్స్ డైరెక్ట్ అనే పత్రిక చెబ్తుంది. పెల్లెట్లు ఏ దిశగా వస్తున్నాయో, ఎంత దూరం నుండి కాల్చారో, ఎలాంటి ఆయుధం వాడారో, పెల్లెట్లు ఎంత లోపలకి చొచ్చుకొని పోగల శక్తితో ఉంటాయో అనే విషయం మీద పెల్లెట్ తుపాకీల ద్వారా అయ్యే గాయాలను అంచనా వేయవచ్చు. పెల్లెట్ తుపాకి కార్ట్రిడ్జ్ లో సీసంతో తయారైన కొన్ని వందల పెల్లెట్లు ఉంటాయి. వంకరటింకరగా, అనేక ఆకారాల్లో పెల్లెట్లు వుంటాయి. పేల్చినపుడు కార్ట్రిడ్జ్ వందల పెల్లెట్లను కొద్దిమీటర్ల దూరం వరకూ వెదజల్లుతుందని ‘ద హిందూ’ పత్రిక తెలియచేసింది. 2016లోనే యువ నిరసనకారులను పెల్లెట్లను ఉపయోగించి చంపుతున్నపుడు, ప్రభుత్వం ఈ విషయం గురించి పట్టించుకొంటుందని అప్పటి భారత హోమ్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ఇప్పుడా పెల్లెట్ తుపాకీలు దిల్లీ దాకా వచ్చాయి. ఇప్పుడైనా వీటిని ఆందోళనకారుల మీద ప్రయోగించటాన్ని నిషేధిస్తారా? పెల్లెట్లకు ప్రత్యమ్నాయంగా మిరపకాయ పొడిని, కాప్సికమ్ పూసిన బాష్పవాయు గోళాలను వుపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. చాలారోజుల క్రితం రాజ్ నాథ్ సింగ్ ‘పెల్లెట్ తుపాకీలకు బదులుగా వేరే వాటిని భద్రతాదళాలకు ఇస్తామని’ చెప్పారు. బీహార్ లో జరిగినట్లు పెల్లెట్ తుపాకిలకు బదులుగా ఏకే -47 తుపాకిలను వాడటం గురించి అతను మాట్లాడలేదని ఆశించాలి. ప్రతిపక్ష నాయకుడిని ప్రెస్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించగా, అమిత్ షా కింద పని చేస్తున్న దిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని తిరస్కరించే కథనాన్ని ఆయన తిప్పికొట్టాడు. అప్పుడే రాహుల్ గాంధీ ఈ ప్రసిద్ద వాక్యాన్ని వాడాడు -‘అమిత్ షా విద్యార్థుల రక్తంలోకి బుల్లెట్లను దించాడు’ అని ఇప్పుడిక అమిత్ షా సృష్టించిన భయపు బుడగ పగిలిపోయింది.
ఎవరి మీదనైనా బుల్లెట్ కాల్చితే, మామూలు పదాల్లో ఎలా చెబుతారంటే లక్ష్యం చేసుకొన్న శరీరం మీద బుల్లెట్టును ప్రయోగించారని. ఇంకా సరిగ్గా చెప్పాలంటే బుల్లెట్టు వలన ఏ శరీర భాగం దెబ్బ తిన్నదో రిపోర్టు చేస్తారు. ఉదాహరణకు గాడ్సే మూడు బుల్లెట్లను మహాత్మా గాంధీ గుండెలోకి, పొట్టలోకి కాల్చాడు అని రిపోర్టు చేస్తారు. ఇంకో ఉదాహరణగా హిట్లర్ తనకు తాను తలలో కాల్చుకొన్నాడు అని కూడా రాస్తారు. బుల్లెట్ ను తలోకో, గుండెలోకో, పొట్టలోకో ‘దించారని’ ఇప్పటి వరకూ ఎవరూ రాయలేదు. “అతను బుల్లెట్లను రక్తంలోకి దించాడు” అనే వాక్యాన్ని చదివితే కలిగే ప్రభావం నిజానికి ఏ వాక్యమూ కలిగించలేదు. ఆ వాక్యంలోకి చివరి భాగం “… విద్యార్థుల రక్తంలోకి” చదివినపుడు ఆ ఉద్వేగం మన నరనరాల్లోకి పాకుతుంది.
కొద్దిసేపు ఆ వాక్యం దగ్గర ఆగి, విద్యార్థుల రక్తంలోకి బుల్లెట్లను దించేటంత క్రూరంగా ఎవరైనా ఎలా ఉండగలరు? అని అందరూ ఆలోచిస్తారు. ప్రతిపక్ష నాయకుడి ఈ వాక్యం మనల్ని ఆలోచింపచేస్తుంది. అలాంటి తెగువని మనం ఎట్టి పరిస్థితుల్లో అలవర్చుకోకూడనీ, ఇంకా కావాలంటే అలాంటి ధైర్యాన్ని వంట పట్టించుకోకుండా తరిమి వేయాలనీ, అలా జనం తరిమి వేయటం వలనే తాము నిర్విఘ్నంగా పాలించవచ్చుననీ ఏ పాలక వ్యవస్థ అయితే కోరుకొంటుందో -ఆ కోరికను ధిక్కరిస్తూ ప్రతిపక్ష నాయకుడు పలికిన ఈ వాక్యం ఆలోచింపచేస్తుంది.
మనది విద్యార్థుల, ఉపాధ్యాయుల దేశం. ఇక్కడ దాదాపు ప్రతి తల్లిదండ్రులూ తాము పాఠశాలకు వెళ్లడం గురించి ఏదో ఒక సమయంలో ఆలోచించి ఉంటారు. తాము చదువుకోలేకపోయినా, తమ పిల్లలైనా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కోరుకుంటారు. మనం జీవిస్తున్న ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్య, ఆహారం, ఆరోగ్యం -ఇవే మనం అత్యంత ప్రాధాన్యంగా భావించే అంశాలు. ఒకే ఒక సాహిత్య వాక్యంలో చెప్పాలంటే -ఈ దేశపు తెలివితక్కువ, వైకల్యపు విద్యావ్యవస్థ మీద నానాటికీ పెరిగిపోతున్న తల్లిదండ్రుల, అధ్యాపకుల, సంరక్షకుల కోపం, వాటితో బాటు విద్యార్థుల ఆగ్రహం -వీటన్నిటికీ ఒక ప్రతినిధి దొరికినట్లైయ్యింది. ‘అతను విద్యార్థుల రక్తంలోకి బుల్లెట్లను దించాడు’ అన్న ఆ వాక్యం ప్రకంపనాలు సృష్టించింది. ఇదంతా చేశాక అమిత్ షా ఇప్పటికీ పార్లమెంటుకు హాజరు అవలేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వటాన్ని తప్పించుకొంటున్నాడు. సొంత శాఖ హోమ్ మినిస్ట్రీ జవాబుదారీతనాన్ని కోరుతున్న ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాడు.





