పెయింట్ షాపులో భారీ అగ్నిప్రమాదం

– రెండు అంతస్తులకు వ్యాపించిన మంటలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ హఫీజ్ పేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. షాపులో పెద్ద మొత్తంలో రసాయనాలతో కూడిన పెయింట్లు, ఇతర మండే స్వభావం కలిగిన సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు షాపులో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించలేదని గుర్తించిన అధికారులు, దుకాణం నిర్వహణకు అవసరమైన అనుమతులపై ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *