న్యూదిల్లీ, నవంబర్ 21: జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు ఆదివారం ముగియనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 11.19 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించి తమ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించారని వెల్లడించింది. కాగా, జేఈఈ మెయిన్ కు ఈ నెల 22న అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 26 వరకు అవకాశం ఉంది. తొలి విడత పరీక్షలను జనవరి 20, 21, 22, 23 24, 28 360 నిర్వహించనున్నారు. ఈ ఆన్లైన్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం https://jeemain.nta.nic.in / వెబ్సైట్ ను చెక్ చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ 011-40759000/ 1800-180-4747, 5-2 jee-main@nta.ac.in లో సంప్రదించాలని ఎన్టీఏ సూచన చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

