క్రిస్మస్, సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు పొడిగింపు

– సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు
– ప్రయాణికుల రద్దీ నియంత్రణకు చర్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: క్రిస్మస్, సంక్రాంతి పండుగల సెలవుల్లో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ సీజన్లో ప్రయాణి కుల అదనపు రద్దీని నియంత్రించేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి స్టేషన్ల నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపో కలు సాగించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
పొడిగించిన రైళ్ల వివరాలు
సికింద్రాబాద్ – సహర్లగన్ ప్రత్యేక రైళ్లు నంబర్ 07046 డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 25, 2026 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
నహర్లగన్- సికింద్రాబాద్ – రైలు నంబర్ 07047 డిసెంబర్ 7, 2026 నుంచి డిసెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
హైదరాబాద్ – దానాపూర్ (రైలు నంబర్ 07091) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 5, 2026 నుంచి డిసెంబర్ 12, 2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
దానాపూర్ హైదరాబాద్ (రైలు నంబర్ 07092) డిసెంబర్ 7, 2026 నుంచి డిసెంబర్ 14, 2026 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు సేవలందిస్తుంది.
చర్లపల్లి – ససారం (రైలు నంబర్ 07041) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 3, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు ప్రతి గురువారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
ససారం- చర్లపల్లి(రైలు నంబర్ 07042 డిసెంబర్ 4, 2026 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
మహారాష్ట్ర- తిరుపతి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: జనవరి 7, 2027 నుంచి జనవరి 14, 2027 వరకు ప్రతి గురువారం నడుస్తుంది (మొత్తం 2 సర్వీసులు).
తిరుపతి- జల్నా : జనవరి 8, 2027 నుంచి జనవరి 15, 2027 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది (మొత్తం 2 సర్వీసులు).
చర్లపల్లి-ప్రతాప్ నగర్ (గుజరాత్) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 5, 2026 నుంచి డిసెంబర్ 26, 2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
ప్రతాప్ నగర్ చర్లపల్లి( రైలు నంబర్ 07088) డిసెంబర్ 6, 2026 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 4 సర్వీసులుంటాయి.
పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల తాజా షెడ్యూల్, సమయాలను ముందుగానే సరిచూసుకుని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *