చిత్రపరిశ్రమలోకి ఉత్సాహంగా వచ్చిన మగువలను మృగాళ్ల.. వదలడం లేదు. అక్కడ విలువలు మృగ్యం. మగ పెత్తనమే ఎక్కువ. ఆడవాళ్లంటే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఓ రకంగా సమాజంలో మగసామ్రాజ్యం ఎక్కడ్కెనా ఉందంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పక తప్పదు. చిత్ర పరిశ్రమ..అది దేశంలో ఏభాషలో అయినా కావొచ్చు.. ఆడవాళ్లను లొంగదీసుకోకుండా నడిచిన దాఖలాలు లేవు. ఇలీవల మాలీవుడ్ అంటే..మళయాలంలో కాస్ట్‌కౌచింగ్ దుమారం రేపింది. కేరళలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలయ్యింది. అక్కడ జరుగుతున్న దారుణాలు బయటపడ్డాయి. నీతి వాక్యాలు వల్లచించే వారి బండారం బయటపడిరది. అమ్మ కమిటీకి మోహన్ లాల్ రాజీనామా చేశారు.
వాడుకోవడం …వదిలేయడం చిత్రపరిశ్రమలో షరామూమూలు అన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ క్రమంలో వివిధ సినీ కమిటీల బాధ్యులు ల్కెంగిక వేధింపుల, దాడుల ఆరోపణలని ఎదుర్కొని రాజీనామా చేశారు. కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్ర పరిశ్రమలోని స్త్రీల పని పరిస్థితులు బాగుచెయ్యటానికి అనేక కొత్త సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం విధిలేని పరిస్థితిలో కార్యాచరణకు పూనుకుంది. ఇదే క్రమంలో నటీమణులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అనుభవాలను, బాధలను బయటపెడుతున్నారు. నిజానికి ఆడవాళ్లు ధ్కెర్యం చేసి చిత్రపరిశ్రమలోకి రాకుంటే…విర్రవీగుతున్న మగాళ్లు ఏమవుతారు. ఆడవేశాలు కూడా వారే వేసుకుంటారా అన్నది ఆలోచన చేయాలి. స్త్రీలు భీష్మించుకుని చిత్రరంగంలోకి రాకుంటే ..డ్రామా కంపెనీల్లాగా చిత్రపరిశ్రమ దుర్గతిని ఎదుర్కోక తప్పదు. నీతి వాక్యాలు వల్లిచే హీరోలు, నిర్మాతలు, దర్శకులు దీనిపై ఆలోచన చేయాలి. చిత్రపరిశ్రమను ఆదర్శం గా నిలపడానికి కృషి చేయాలి.
పని స్థలాల్లో స్త్రీల ల్కెంగిక వేధింపుల గురించి తెలుగు సమాజాల్లో జరుగుతున్న చర్చ దేశంలో ఇతర చోట్ల జరుగుతున్న చర్చలకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. బెంగాల్‌లో ఆర్‌జి కార్ ఆస్పత్రిలో జరిగిన ఘటన తర్వాత ఆ రాష్ట్రంలో హింసా సంస్కృతి గురించే కాకుండా, పని స్థలాల్లో ల్కెంగిక వేధింపులు, దాడుల్ని సమర్థించే సంస్కృతి గురించి అందరూ మాట్లాడుతున్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ఎంతోమంది వాదిస్తున్నారు. అయితే ఎన్ని ఘటనలు జరుగుతున్న..కుక్కతోక వంకర అన్న చందంగా మన దగ్గర మాత్రం ఇలాంటి చర్చలు జరగటం లేదు. పరిశ్రమలో ఆడవాళ్ళ పని పరిస్థితుల గురించి అస్సలు ఎవ్వరూ మాట్లాడటంట్లేదు. వారిని తోటివారుగా గౌరవించడం లేదు. ఇలా తమిళనాడు, బాలీవుడ్, ఒక్కటేమిటి అన్ని భాషల్లోనూ చిత్రపరిశ్రమలోకి రావాలనుకున్న…వచ్చిన మహిళలు వివక్షను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. నిజానికి పనిప్రదేశాల్లో అన్ని చోట్లా ఇదే దుస్థితి ఉంది. కాకపోతే చిత్రపరిశ్రమలో కాస్తా ఎక్కువగా ఉంటుందని చర్చించుకోవాల్సి వస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో పేరున్న డాన్స్ మాస్టర్ జానీ విరీద అతని అసిస్టెంట్ దాఖలు చేసిన ల్కెంగిక వేధింపులు, దాడికి సంబంధించిన ఫిర్యాదు గురించిన చర్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వందలాది మందిని కదిలించింది. అయ్యో జానీ మాస్టార్ అంటూ నీతులు వల్లిస్తున్నారు. ఆ అమ్మాయి సొంతంగా బతుకీడుద్దామనుకుంటున్న తరుణంలో కూడా వేధింపులకు పాల్పడ్డ జానీ తీరును ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. ఆమె ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ..ఎందుకు ఫిర్యాదు చేసింది..ఇన్నాళ్లూ ఇష్టంతోనే అతడితో ఉంది కదా? ఆమెను ఎవరు వాడుకుంటున్నారు. అతని పట్ల అసూయతోనే ఈ ఫిర్యాదు చేయించారు అంటూ నస పెడుతున్న వారు నిజాలు ఆలోచన చేయాలి. ఇటువంటి వాదనలతో నిజాలను పక్కదారి పట్టించలేరు. సోషల్ విరీడియా ఇదే వాస్తవమన్న అభిప్రాయాన్ని కలుగచేస్తోంది. తెలుగు సినిమా పెద్దలు కూడా నేరం రుజువయితేనే అతని విరీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆయనకి పరోక్షంగా మద్దతు కూడగడుతున్నారు. జానీ మాస్టర్ అలా చేయడని కొందరు వంతపాడుతున్నారు.
ఎవరు ఎలాంటి వారన్నది ఇలా ఆరోపణలు యటకు వచ్చినప్పుడే కదా తెలిసేది. 2018లో శ్రీరెడ్డి, ఇతర కళాకారులు తెలుగు సినీ పరిశ్రమలోని పురుషాధిపత్య సంస్కృతినీ, ల్కెంగిక దాడీనీ తమ నిరసనల ద్వారా అందరి ముందుకీ తెచ్చారు. అప్పుడు ఆమెను వెక్కిరించినవారు, ఈసడిరచుకున్న వారే ఎక్కువ. డ్రగ్స్‌తో పట్టుబడ్డప్పుడు కూడా ఇలాగే వాదిస్తున్నారు. కానీ నిజాలను ఒప్పుకోరు. తమకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని బతుకుతున్నారు. దాని జోలికి ఎవరూ రావొద్దని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితి ప్రకారం కొత్తవాళ్ళకి పని చేసే అవకాశం రావాలన్నా, లేక అసోసియేషన్ కార్డు పొందాలన్నా కోఆర్డినేటర్లపైనా, పైనున్న మగ మాస్టార్లపైనా ఆధార పడాలి. వారికి లొంగి ఉంటేనే అసలు పనిచేసే అవకాశాలు వస్తాయి. పరిశ్రమ వారి మాటే వింటుంది. అందుకే జానీమాస్టర్ లాంటి వారు దీనిని అలుసుగా తీసుకుని లొంగగదీసుకుంటున్నారని అర్థం అవుతోంది.
తనకంటే 20ఏళ్ళు చిన్నద్కెన అమ్మాయి, అదీ మైనారిటీ తీరని వయసులో ఉన్న అమ్మాయి పట్ల ఓ మాస్టర్ వ్యవహరించిన తీరుపైన చర్చించాలి. పరిశ్రమలో నిలబడడానికి వచ్చిన జూనియర్‌ను ప్రోత్సహించాల్సింది పోయి.. బ్లాక్‌మెయిల్ చేసి కామవాంఛ తీర్చుకునే దగుల్బాజీలను ఎండగట్టాల్సిందే. సినిమా పరిశ్రమలో అత్యధిక శాతం తనకి మద్దతు ఇవ్వదని, వ్యతిరేకంగా మాట్లాడతారని తెలిసి కూడా ఆమె ఫిర్యాదుకు వచ్చిందంటే జానీ మాస్టర్ ఆమెను ఎంత తీవ్రంగా నియంత్రిస్తున్నాడో అర్థం చేసుకోవొచ్చు. ఆమెతో పాటు పని చేసే డాన్సర్లు, ఇతర సంఘాల్లో ఉండే అనేక మంది స్త్రీలు, ఇంకా చెప్పాలంటే పరిశ్రమలో దాదాపు అందరు స్త్రీలు కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారని మనం అనుకోవొచ్చు. వాళ్ళు చెయ్యలేని ధ్కెర్యం ఆమె చేసినందుకు అభినందించాలి. మాలీవుడ్ లాగా టాలీవుడ్‌లోనూ జస్టిస్ హేమ కమిటీ లాంటిది రావాలేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకునే దాకా తెలుగు పరిశ్రమ రాకుండా ఉంటే మంచిది. పరిశ్రమలో ఉన్న సినీ దిగ్గజాలు ఈ దుస్థితిపై చర్చించాలి. పరిశ్రమ గౌరవాన్ని కాపాడాలి. తమకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలి. నిజానికి చెప్పాలంటే ఇలాంటి దుస్థితి అన్ని పరిశ్రమల్లో ఉంది. ఎక్కడ ఉన్నా దానిని ఎధీరించాల్సిందే. నిలదీయాల్సిందే. సమర్థించే వారిని నిగ్గదీ యాల్సిందే. అప్పుడే భయం అన్నది పుట్టుకుని వొస్తుంది.
-చరణ్