అడవిలో చెట్ల మీద
యధేచ్చగా సాగుతున్న వేట
కారణమెంటని రాజ్యాన్ని ప్రశ్నిస్తే…
ఆయుధాలున్నాయాన్న అనుమానమంది
ఆయుధాలేవి? అని ప్రశ్నిస్తే….
నేల రాలిన చెట్లను చూపుతున్న రాజ్యం
ఆయుధాలేవని మరోసారి గట్టిగా ప్రశ్నిస్తే
వాటిలోపటున్నాయేమోననే….
మొదల్లకు నరికి వాటిని చీల్చి వేతుకుతున్నామనే
దురుసు సమాధానం
ఏళ్ళు గడిచాయి
చెట్లు నేలరాలిన ప్రాంతంలోనే
తవ్వకాలు చేస్తున్న రాజ్యపు ప్రేమికుడు
అడవినెందుకు తవ్వుతున్నారంటే…
అడవెక్కడుందని ఎదురు ప్రశ్న?
ఆంతరంగికుడికి వంతపాడిన రాజ్యం
ఇద్దరు కలిసిచేస్తున్న గేలి వికట్టహాసానికి
అడవంత ప్రశ్న నా మొఖాన మొలిస్తే…
లోలోనంత గింగిరాలు తిరుగుతున్న సమాధానం
కుట్ర….కుట్ర….కుట్ర….కుట్ర….కుట్ర…కుట్ర….
– దిలీప్.వి
జిల్లా ప్రధానకార్యదర్శి
మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్:8464030808