పరిశ్రమలతో విద్యార్థుల కనెక్ట్

– జాబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్

మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలకు విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని, స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అని చెప్పారు. ఈ ప్రాంతంలో, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలకు కూడా ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్ నున అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్ వేర్‌పైనే దృష్టి సారించకుండా ఇంకా చాలా రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతం మందమర్రిలో జర్మన్ నేర్పిస్తున్నామని, వారిలో బీ2 లెవల్ వచ్చిందన్నారు. వారి కోసం రూ.25 లక్షల జీతం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా ఖర్చులను కూడా సగం వరకూ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని మంత్రి వివేక్ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *