– దసరా కానుకగా మహిళలకు చీరల పంపిణీ
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యవసా య, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఎఫ్ సిఐ బైపాస్ రోడ్డు దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుండి ఎంబి గార్డెన్స్ వరకు రూ. 180 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందాలన్నారు. ఇళ్లు కేటాయించేటప్పుడు గుడిసెలలో నివసించే నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డివిజన్ లో ప్రజలకు అవసరమైన డ్రెయిన్లు, పార్కులు, రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ లైన్ల వంటి మౌలిక వసతుల పనులను వెంటనే మంజూరు చేయించి వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. పేదరికం నుండి శాశ్వ త విముక్తి పొందేందుకు చదువు ఒక్కటే మార్గమని మంత్రి అన్నారు. ఖమ్మంలో ముఖ్య మంత్రి సహకారంతో మోడల్ స్కూళ్లు, ఇంటి గ్రేటెడ్ స్కూళ్లతో పాటు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు వెచ్చించి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్య, వసతి, పుస్తకాలు, దుస్తులు అందిస్తోందన్నారు. నగరంలో కబ్జాలు, దౌర్జన్యాలు, పోలీస్ కేసుల ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖసంతోషాలు, ప్రశాంతతతో జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే దసరా పండుగ సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి కానుకగా చిలకపచ్చ చీరల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి ప్రజలందరూ బాధ్యతాయుతంగా తమ వంతు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ హస్మం తరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





