– నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం పిలుపు
న్యూదిల్లీ, అక్టోబర్ 10 : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన దిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎసఐఆర్Ž)లో అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ ఇండి కూటమి పక్షాలు దిల్లీలో నిరసనలు చేపడుతున్న విషయం విదితమే. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎసఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలనే డిమాండ్‌తో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటంలో సంఘీభావం తెలపడానికి దిల్లీ వేదికగా నిర్వహించే నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ జిల్లా కమిటీల అధ్యక్షులు, టీపీసీసీ ముఖ్య నాయకులు, మంత్రులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





